నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ క్రింద ఆదుకోవాలి.

నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ క్రింద ఆదుకోవాలి.

..నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ క్రింద ఆదుకోవాలి..

 (పుట్లూరు జనచైతన్య న్యూస్)

 నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ కింద పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని , రాష్ట్ర జిల్లా ఉన్నత అధికారులను మండల బిజెపి మండల అధ్యక్షుడు రాగేని రామంజి యాదవ్ పేర్కొన్నారు.అనంతరం మండల అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ మాట్లాడుతూ పుట్లూరు మండల పరిధిలోని చింతకుంట, కడవకల్లు,పుట్లూరు,సూరేపల్లి,కొండాపురం, చెర్లోపల్లి గ్రామాల్లో రైతులు అత్యధిక విస్తీర్ణంలో అరటి బొప్పాయి దానిమ్మ,చీనీ పంటలను సాగు చేస్తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలు రావడంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి పంటలు నేలకొరిగాయి. అదేవిధంగా దేశానికి వెన్నెముక లాంటి వారని అలాంటి రైతన్నలకు నష్టం వాటిల్లిందని వాపోయారు. రైతన్నలు వారి భూమిపై నమ్మకాన్ని పెట్టుకొని సాగు చేసిన పంటలకు అకాల వర్షం రూపంలో పంట నష్టం సంభవించడం పై అన్నదాతలు ఆవేదన చెందుతున్నారన్నారు. అదేవిధంగా ఆర్బికే పరిధిలో ఉన్న గ్రామాల్లో పంట నష్టం పై ఉద్యాన శాఖ ,వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ,సమన్వయంతో పంట నష్టం అంచనా నివేదిక తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత అధికారులకు పంపించి,ప్రత్యేక ప్యాకేజీ కింద పంట నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని పుట్లూరు బిజెపి మండల అధ్యక్షుడు రాగేని రామంజి యాదవ్ డిమాండ్ చేశారు.